How to Download Covid vaccinated certificate in mobile

మనం వాక్సిన్ వేసుకున్నట్టుగా సర్టిఫికేట్ మొబైల్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి.

మీరు కింధ ఉన్న సమాచారాన్ని వినాలి అనుకుంటే పైన కనబడుతున్న Play బటన్ పై క్లిక్ చేయండి.



vaccinated certificate కోవిడ్  వాక్సిన్ వేసుకున్నట్టు సర్టిఫికెట్ మన మొబైల్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం  భారతదేశంలో రెండు రకాల కోవిడ్ వాక్సిన్ లు అందుబాటులో ఉన్నాయి. 1. కోవాక్సిన్ 2. కోవిడ్ షీల్డ్. మనం ఈ రెండిట్లో ఏ వాక్సిన్ వేసుకున్నా కూడా సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు

మనం వాక్సిన్ వేసుకున్నట్టుగా సర్టిఫికేట్  రెండు రకాలుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మొదటిది వ్యాక్సిన్ వేసుకున్న అప్పుడు మన మొబైల్ నెంబర్ కి వచ్చిన రిఫరెన్స్ ఐడి ద్వారా.  రెండవది మనం వాక్సిన్ వేసుకునేందుకు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా.

చాలా  మంది దగ్గర రిఫరెన్స్ ఐడి ఉండదు. కాబట్టి, మనం ఇప్పుడు మొబైల్ నెంబర్ ద్వారా ఎలా వాక్సినేటెడ్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుంధాం.

  • ‌ముందుగా మనం ఆరోగ్య సేతు అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసి ఇంస్టాల్ చెయాలి.
  • ‌తరువాత అప్లికేషన్ ను ఓపెన్ చేసి ఏదైనా మీ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అవ్వాలి.
  • రిజిస్టర్ చేసేందుకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటిపి మీద క్లిక్ చేయండి. తరువాత ఓటిపి ని ఎంటర్ చేసి వెరిఫై అని క్లిక్ చేయండి.
  • ‌తరువాత మెయిన్ స్క్రీన్ లో  మూడోవ ఆప్షన్ వాక్సిన్ మీద క్లిక్ చేయండి.
  • ‌అక్కడ మీరు ఎవరిదైతే సర్టిఫికెట్ డౌన్లోడ్ చేయాలి అనుకుంటున్నారో, వాళ్ళు వాక్సిన్ వేసుకునేటపుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ ను నమోదు చేయండి. మళ్ళీ ఓటిపి వస్తుంది నమోదు చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే సర్టిఫికెట్ డౌన్లోడ్ అవుతుంది.
Video Tutorial for download vaccinated certificate

మీరు ఇదే విధంగా కాకుండా, డిజి లాకర్ మరియు కోవిన్ వెబ్సైట్స్ లో రిఫరెన్స్ ఐడి ద్వారా కూడా కోవిడ్ వాక్సిన్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

డిజి లాకర్ వెబ్సైట్ ను ఉపయోగించి వ్యాక్సినేటెడ్ సర్టిఫికెట్ ఎలా డౌన్లోడ్ చేయాలి.

ముందుగా డిజి లాకర్ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. తరువాత అక్కడ రిఫరెన్స్ ఐడి నమోదు చేసి గెట్ సర్టిఫికెట్ మీద క్లిక్ చేయండి అంతే, మీ సర్టిఫికెట్ డౌన్లోడ్ అవుతుంది.

డిజి లాకర్ ను ఉపయోగించి మనం ఎటువంటి సర్టిఫికెట్ నైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు డ్రైవింగ్ లైసెన్స్, మర్క్స్ మెమో మరియు వ్యాక్సినేటెడ్ సర్టిఫికెట్. మనం డిజిలాకర్ లో సేవ్ చేసుకున్న సర్టిఫికెట్స్ ఒరిజినల్ తో సమానం.

ఈ సమాచారాన్ని మీరు షేర్ చేయాలి అనుకుంటే కింద ఉన్న సోషల్ మీడియా బటన్స్ ద్వారా షేర్ చేయండి

Leave a Comment