How to install Google Sitekit Plugin Perfectly

Google SiteKit Plugin ని ఇన్స్టాల్ చేయాలి.

మీరు కింధ ఉన్న సమాచారాన్ని వినాలి అనుకుంటే పైన కనబడుతున్న Play బటన్ పై క్లిక్ చేయండి.

కొత్తగా  WordPress లో బ్లాగింగ్ చేస్తున్న వాళ్లకి చాలా బాగా ఉపయోగపడే ఒక ప్లగిన్ గురించి  తెలుసుకుందాం.  మొదట బ్లాగింగ్ చేస్తున్న ఎవరికైనా ఉపయోగపడే కొన్ని టూల్స్ గురించి తెలుసుకుందాం. గూగుల్ సెర్చ్ కౌన్సిల్, అనలిటిక్స్, పేజ్ ఇన్ సైట్స్ మరియు గూగుల్ యాడ్ సెన్స్.

అయితే మనం ముందుగా ఈ టూల్స్ యొక్క ఉపయోగం తెలుసుకుందాం.

1. Google Search Console


గూగుల్  సెర్చ్ కన్సోల్ మనకి మన వెబ్ సైట్ ని గూగుల్ సెర్చ్  ఇంజిన్ లో తొందరగా ఇండెక్స్ చేయటానికి ఉపయోగపడుతుంది. ఎందుకు మన వెబ్ సైట్ ని గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఇండెక్స్ చేయాలి.  మనం బ్లాగింగ్ చేస్తున్నప్పుడు మనం రాసిన పోస్టులకు ప్రేక్షకులు రావాలి అంటే కచ్చితంగా గూగుల్ సెర్చ్ ఇంజన్లో మన వెబ్ సైట్ ని ఇండెక్స్ చేసి ఉండాలి. ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే ముందుగా గూగుల్ సెర్చ్ ఇంజన్లో వెతుకుతారు. అలా ఎవరైనా వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం వెదికినప్పుడు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను మన వెబ్ సైట్ లో రాసినట్లయితే మన వెబ్ సైట్ వాళ్లకు కనిపించేందుకు గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఇండెక్స్ అయి ఉండాలి.


అంతేకాకుండా మన వెబ్ సైట్ కి గూగుల్ సెర్చ్ ఇంజన్ నుంచి ఎంత మంది ప్రేక్షకులు వచ్చారు. వాళ్లు ఏ పోస్ట్ ని చూశారు మరియు మనం రాసిన పోస్ట్ ని గూగుల్ ఎంతమందికి ఇన్ఫర్మేషన్ రూపంలో చూపించింది. అనే విషయాల గురించి మనం తెలుసుకోవచ్చు.

2. Google Analytics


గూగుల్ అనలిటిక్స్ వాడడం ద్వారా మన వెబ్ సైట్ కి ఎంత మంది ప్రేక్షకులు వచ్చారు, ఏ సమయంలో వచ్చారు, ఏ పేజెస్ ని చూశారు మరియు ఏ మార్గాల ద్వారా వచ్చారు. ఇలాంటి సమాచారం అంతా తెలుసుకోవచ్చు.
ఉదాహరణకు మన వెబ్ సైట్ కి  గూగుల్ సర్చ్ నుంచి వచ్చారా, సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా వచ్చారా లేకపోతే నేరుగా లింక్ ద్వారా వచ్చారా. అలాగే ఏ సమయంలో మన వెబ్సైట్కి ఎక్కువ మంది ప్రేక్షకులు వస్తున్నారు. ఇలాంటి సమాచారం అంతా మనం మనకు ఇంస్టాల్ చేసుకున్న WordPress డాష్ బోర్డు లోనే చూసుకోవచ్చు.ఈ టూల్ ని మనం  ఉచితంగా వాడుకోవచ్చు


3. Page Insights


ఈ టూల్ ని వాడటం ద్వారా మన వెబ్సైట్ పేజ్  ప్రేక్షకులకి ఎంత వేగంగా లోడ్ అవుతోంది అనే విషయం గురించి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మన వెబ్ సైట్ లోడ్ అయ్యేటప్పుడు ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మన వెబ్ సైట్ లో వాడిన ఫొటోస్ ఏమైనా నిదానంగా అవుతున్నాయా లేదా వెబ్ సైట్ కి ఇన్స్టాల్ చేసిన థీమ్ వాళ్ల ఏమైనా నిదానంగా పని చేస్తుందా. అనే విషయాల గురించి తెలుసుకోవచ్చు. మన వెబ్ సైట్ లో ఎక్కడైనా అనవసరమైన జావాస్క్రిప్ట్ లేదా హెచ్టిఎంఎల్ లేదా css లాంటివి ఏమైనా ఉంటే గుట్ట కనుక్కోవచ్చు.
అంతేకాకుండా మన వెబ్సైట్ మొబైల్ ఫోన్ లో ఎలా లోడ్ అవుతోంది మరియు కంప్యూటర్లో ఎలా లోడ్ అవుతోంది అనే సమాచారం గురించి తెలుసుకోవచ్చు.


4. Google Adsense


గూగుల్ యాడ్ సెన్స్ ద్వారా మన వెబ్ సైట్ లో అడ్వటైజ్మెంట్  నీ రన్ చేస్తూ మనం డబ్బులు సంపాదించవచ్చు. అయితే గూగుల్ సైట్ కిట్ లో మనకు మన వెబ్ సైట్ లో ఆటో ఆప్టిమైజ్ యాడ్స్ ఏక్ నిరంజన్ చేయొచ్చు.
బ్లాగింగ్ చేసే ఎవ్వరికైనా డబ్బులు సంపాదించాలి అనుకుంటే యాడ్ సెన్స్ ఒకటే ఉత్తమ ఛాయిస్.

ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ గూగుల్ సైట్కిట్ ప్లగిన్ నీ మన వర్డ్ ప్రెస్ వెబ్ సైట్ లో ఎలా ఇంస్టాల్  చేయాలో చూద్దాం.

YouTube వీడియో ఎడిటింగ్ కోసం ప్రీమియం అప్లికేషన్స్

గూగుల్ సైట్ కిట్ ఇన్స్టలేషన్  ప్రక్రియ.


మనం వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ లో కి లాగిన్ అయిన తరువాత, ప్లగిన్ సెక్షన్ లో యాడ్ న్యూ ప్లగిన్ మీద క్లిక్ చేయండి.
అక్కడ సెర్చ్ ఆప్షన్ లో గూగుల్ సైట్ కిట్ అని టైప్ చేసి ఇన్స్టాల్ చేసినతరువత ఆక్టివేట్ చేయంపీ.


వర్డ్ప్రెస్ డాష్బోర్ల్ మెనూ లో సైట్ కిట్ మీద క్లిక్ చేయండి.


కనెక్ట్ సెర్చ్ కన్సోల్, అనలిటిక్స్, పేజ్ ఇంసైట్స్ మరియు యాడ్ సెన్స్ మీద క్లిక్ చేయండి.


మీ గూగుల్ అకౌంట్‌కి సైన్ ఇన్ చేసి, ఈ సర్వీసుల కోసం మీరు ఏ ఖాతాను ఉపయోగించాలనుకుంటున్నారో ఎంచుకోండి.

ఈ సమాచారాన్ని మీరు షేర్ చేయాలి అనుకుంటే కింద ఉన్న సోషల్ మీడియా బటన్స్ ద్వారా షేర్ చేయండి.

Leave a Comment