How to upload movies in youtube without copyright and earn money

కాపీరైట్ స్ట్రైక్ రాకుండా యూట్యూబ్ లో మూవీస్ అప్లోడ్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలి

ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. అయితే యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాలి అనుకున్న తర్వాత ఏ అంశం మీద వీడియోలు  ఏం చేయాలో తెలియక నిరాశ చెందుతుంటారు.  ఎందుకంటే మనం యూట్యూబ్ ఛానల్ నుంచి డబ్బులు సంపాదించాలంటే కచ్చితంగా యూట్యూబ్ ఛానల్ కి 4,000   గంటల వాచ్ టైం మరియు 1,000 subscribers వచ్చి ఉండాలి.

యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన మొదట్లో చాలా మంది చేసే తప్పు వాళ్ళ స్నేహితులు మరియు వాళ్ళ బంధువులు దగ్గర వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ని  సబ్ స్క్రైబ్ చేయించి వల్ల ఫోన్ లో కూడా ప్లే చేస్తారు. కానీ, అలా చేయటం ద్వారా ఛానల్ మొనెటీజ్ అవ్వదు.

చాలా మంది  అతి సులభంగా వాళ్ల యొక్క యూట్యూబ్ ఛానల్ లో వాచ్ టైం పెరగాలని మూవీస్ ని అప్లోడ్ చేస్తారు, కానీ, మూవీస్ ని అప్లోడ్ చేసిన తర్వాత కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. ఒకవేళ అప్పుడు కాపీరైట్ క్లెయిమ్ రాకపోయినా కొన్ని రోజుల తర్వాత ఎవరైతే సినిమా మూవీ యొక్క  కాపిరైట్స్  కొంటారు వాళ్ళు మీ చానల్ మీద  కాపీరైట్ స్ట్రైక్ వేస్తారు.

మరి యూట్యూబ్ లో  ఎలా మూవీస్ ని అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించాలి.

యూట్యూబ్ లో మనం పాత సినిమాలు డౌన్లోడ్ చేసి డబ్బులు సంపాదించవచ్చు.  పాత సినిమాల యొక్క డిజిటల్ రైట్స్ ఎవరూ కొనుగోలు చేసి ఉండరు. కాబట్టి పాత సినిమాలను  మనం మన చానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు.

మరి ఇప్పటి వరకు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన కొత్త సినిమాల సంగతేమిటి

  ఇప్పటి వరకు యూట్యూబ్లో  అప్లోడ్ చేసిన మూవీస్ కి మూడు రకాల  కారణాలు ఉన్నాయి
1.    వాళ్లు అప్లోడ్ చేసిన మూవీ కాపీ రైట్స్ డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసి ఉంటారు.
2.  కొన్ని  సినిమాలు మన దేశంలో అప్లోడ్ చేస్తే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. కానీ, విదేశాల నుంచి అప్లోడ్ చేస్తే కాపీరైట్ క్లెయిమ్ రాదు.  ఇలాంటి మూవీస్  కొన్ని మాత్రమే ఉంటాయి.
3.  ముందుగా  సినిమా కాపీరైట్  కోన్న వాళ్ళ దగ్గరనుంచి  మీరు  యూట్యూబ్ లో అప్లై చేసుకునేందుకు వాళ్ల దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి.

మూవీస్ ని కాపీరైట్ క్లెయిమ్ రాకుండా ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయవచ్చా

మనం సినిమా ని ఎంత ఎడిటింగ్  చేసినా కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది.  ఒకవేళ అప్లోడ్ చేసినప్పుడు రాకపోయినా, ఎవరైతే సినిమా యొక్క కాపీ రైట్స్  కొనుగోలు చేసి ఉంటారో వాళ్లు ఆ సినిమాను చూసినప్పుడు  మీ  యూట్యూబ్ ఛానల్  పై కాపీరైట్ స్ట్రైక్ వేస్తారు.  మీ ఛానల్ పై మూడు కాపీరైట్ స్ట్రైక్స్ కనుక వస్తే మీ ఛానల్ డిలీట్ అయిపోతుంది.

ఇప్పుడు చిన్న చిన్న న్యూస్ ఆర్టికల్స్ రాస్తూ డబ్బులు సంపాదించండి.

ఈ సమాచారాన్ని మీరు షేర్ చేయాలి అనుకుంటే కింద ఉన్న సోషల్ మీడియా బటన్స్ ద్వారా షేర్ చేయండి.

3 thoughts on “How to upload movies in youtube without copyright and earn money”

Leave a Comment