మీ అద్ధార్ కార్డ్ ఇంటి వద్ద నుంచే పోస్ట్ మ్యాన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్యూ
ఏ పి ప్రభుత్వం కొత్త గా ఒక ఆధార్ సర్వీస్ ను పోస్ట మెన్ ద్వారా తీసుకొంచింది. ఇదువరకు లాగా ఆధార్ కార్డులో ఫోన్ నంబర్ అప్ డేట్ చేయించుకునేందుకు మనం ఆధార్ కేంద్రం వరకు వెల్లనవసరం లేదు. పోస్టుమ్యాన్ కు కబురు పెడితే ఆయనే వచ్చి ఆధార్ కార్డులో ఫోన్ నంబరు అప్డేట్ చేస్తారు. 50 రూపాయలు చెల్లించి ఈ సేవలను పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ తపాలా శాఖ జూన్ నుంచి ఈ తరహా సేవలను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 5లక్షల మంది ఈ సేవలు పొందారు. భీమవరం, ఏలూరు, గుడివాడ, నెల్లూరు, విజయనగరం తపాలా డివిజన్లలో ఈ సేవలు ఇప్పటివరకు ఎక్కువగా అందాయి. పోస్టుమ్యాన్ల వద్ద ఉండే ఒక మొబైల్ అప్లికేషన్ సాయంతో వారు వినియోగదారుల మొబైల్ నంబర్ ను ఆధార్ కార్డుకు లింక్ చేస్తున్నారు.
ఆధార్ కు ఫోన్ నంబర్ లింక్ చేసే సేవలను పైలట్ ప్రాజెక్టుగా గుడివాడ, భీమవరం ప్రాంతాల్లో ఏప్రిల్ ఒకటి నుంచే మొదలు పెట్టినట్లు ఏపీ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ డా.ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. జూన్ ఒకటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.
ఈ సమాచారాన్ని మీరు షేర్ చేయాలి అనుకుంటే కింద ఉన్న సోషల్ మీడియా లింక్స్ ద్వారా షేర్ చేయండి.